Kodada MLA Padmavathi : ప్రభాత సూర్యుడు దినపత్రిక 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
Calander Launching by Kodad MLA Padmavathi Uttam Kumar Reddy
ప్రభాత సూర్యుడు దినపత్రిక 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
- పత్రికలు సమాజాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించాలి
- కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి
చిలుకూరు - ప్రభాత సూర్యుడు
పత్రికలు సమాజాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభాత సూర్యుడు తెలుగు దినపత్రిక సంబంధించిన క్యాలెండర్ ని శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు,న్యాయ వ్యవస్థ ఎలా రక్షణ కల్పిస్తు న్యాయాన్ని చేస్తాయో అలాగే పత్రికలు కూడా ఫోర్త్ ఎస్టేట్ ల నిరుపేదలకు న్యాయం జరిగేలా తమదైన శైలిలో వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాత సూర్యుడు పత్రిక రిపోర్టర్ మాతంగి వెంకటేశ్వర్లు, చిలుకూరు మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్ రెడ్డి, మూసి శ్రీను, మాతంగి సైదులు (రిపోర్టర్), చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కీత వెంకటేశ్వర్లు, పిండ్రాతి హనుమంతరావు, కాంపాటి గురవయ్య (రిపోర్టర్), సిద్దెల శ్రీనివాసరావు, నూకపంగు సైదులు, గోవిందా చారి (రిపోర్టర్), బ్రహ్మం (రిపోర్టర్), వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.