AP POLITICS: మార్చి నుంచి జనాల్లో జగన్
ఎక్కడా పెద్దనో అక్కడి లేగుస్త
మార్చి నుంచి జనాల్లో జగన్
గుంటూరు - ప్రభాత సూర్యుడు
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో ఒక రకమైన నైరాశ్యం కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో జగన్ జనాల్లోకి వస్తున్నారు. ఆయనతో పాటే మరికొందరు నాయకులు యాక్టివ్ అవుతారని తెలుస్తోంది.వైసీపీ స్వరం పెంచుతోంది. పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్న వేళ.. ఉన్నవారితో రాజకీయం చేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే వీలైనంతవరకు నేతలను క్రియాశీలకం చేస్తున్నారు. తన వెంట ఉండే వారికి తప్పకుండా ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది సైలెంట్ అయ్యారు. కొందరు అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయారు. మరికొందరైతే సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు. కొందరు ముఖ్య నాయకులు సొంత నియోజకవర్గాల మొఖం కూడా చూడడం లేదు. ఈ తరుణంలో జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారానికి రెండు రోజులపాటు ఉండనున్నారు. అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోనున్నారు.పార్టీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు వెళ్లిపోయిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో వైసీపీ నేతలకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు జగన్. పార్టీలో యాక్టివ్ అవ్వండి.. లేకుంటే విూ ప్లేస్ లో కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగిస్తామని హెచ్చరిస్తున్నారు. తాను జిల్లాల పర్యటనకు వచ్చేలోగా.. నియోజకవర్గాల్లో క్రియాశీలకం కావాలని సూచిస్తున్నారు. మార్చి నెల నాటికి మొత్తం మాజీ మంత్రులంతా యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.వైసీపీ ఫైర్ బ్రాండ్లలో చాలామంది ఉన్నారు. కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, జోగి రమేష్, రోజా లాంటి నేతలు పెద్దగా కనిపించడం లేదు. అనిల్ కుమార్ యాదవ్ జాడలేదు. కొడాలి నాని అయితే నియోజకవర్గానికి రావడం మానేశారు. ఇటువంటి నేతలంతా మార్చి నుంచి యాక్టివ్ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ కార్యాలయం నుంచి వీరికి సమాచారం వెళ్లిందట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే.. విూ స్థానంలో వేరే నేతలు వస్తారని అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. దీంతో చాలామంది నేతలు తిరిగి నియోజకవర్గాల్లోకి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇంకోవైపు వైసీపీ నేతలు విమర్శల డోసు పెంచారు. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. పథకాలు అమలు చేయలేమని చంద్రబాబు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ నేతలు ఒక్కసారిగా చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ‘ సంపద సృష్టి లేదు సంపంగి పువ్వు లేదు ‘ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయితే ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. చంద్రబాబును జిత్తుల మరి నక్కగా అభివర్ణించారు. తల్లికి వందనం కాదు తద్దినం పెట్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే వైసీపీ నేతలు యాక్టివ్ కావడం.. ప్రభుత్వాన్ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ జనాల్లోకి వస్తే మాత్రం పొలిటికల్ హీట్ పెరగడం ఖాయం.