Supersonic Missiles : రక్షణ రంగంలో భారత్‌ మరో మైలురాయి

On
Supersonic Missiles : రక్షణ రంగంలో భారత్‌ మరో మైలురాయి

రక్షణ రంగంలో భారత్‌ మరో మైలురాయి

ముంబై - ప్రభాత సూర్యుడు

భారతదేశం స్వశక్తితో వ్యూహాత్మక ఆయుధాలను తయారుచేసుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తుంది. ఈ క్రమంలో సూపర్‌ సోనిక్‌ క్షిపణులను అభివృద్ధి చేయడంలో దృష్టిసారించింది.. తద్వారా దేశ రక్షణ రంగం సరికొత్త మైలురాళ్లను చేరుకుంటుంది. తాజాగా.. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్డీవో) విభాగమైన హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ ల్యాబోరేటరీ (డీఆర్డీఎల్‌) దీర్ఘకాలిక సూపర్‌ సోనిక్‌ కంబష్టన్‌ రాంజెట్‌ (స్క్రాంజెట్‌) ఇంజిన్‌ ను విజయవంతంగా గ్రౌండ్‌ టెస్ట్‌ చేసింది. 120 సెకన్లపాటు గ్రౌండ్‌ టెస్ట్‌ జరిపినట్లు రక్షణ శాఖ వెల్లడిరచింది. హైపర్‌ సోనిక్‌ క్షిపణులు ధ్వని వేగంకంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. అంటే ఇవి మాక్‌5 కంటే వేగంగా దూసుకుపోతాయిభారతదేశంలో అత్యంత విశ్వసనీయ ప్రొవైడర్‌ ` స్టార్‌ హెల్త్‌తో ఆన్‌లైన్‌లో ఆరోగ్య భీమాను కొనండి. పన్ను ఆదా చేయండి, విూ ప్రియమైనవారికి అవసరమైన రక్షణను అందిస్తూ తక్షణమే భద్రత కల్పించండి.డీఆర్డీఓ చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైర్మన్‌ డాక్టర్‌ వీ సవిూర్‌ కామత్‌, ఇతర బృందాన్ని రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ అభినందించారు. తరువాతి తరం హైపర్‌ సోనిక్‌ క్షిపణుల అభివృద్ధిలో ప్రస్తుతం విజయవంతం అయిన ప్రయోగం ఒక ముఖ్యమైన దశ అని చెప్పారు. డీర్డీవో అధికారి ఒకరు మాట్లాడుతూ.. అమెరికా, రష్యా, చైనా, భాతరదేశం హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీపై పనిచేస్తున్న దేశాలలో ఉన్నాయని, ఈ సాంకేతికతకు కీలకం స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌లలో ఉందని తెలిపారు. హైపర్‌ సోనిక్‌ క్షిపణులు 5,400 కిలో విూటర్ల (మాక్‌ 5) వేగంతో ప్రయాణించగలవు. ఇవి ధ్వనివేగం కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్‌ హైపర్‌ సోనిక్‌ క్షిపణుల అభివృద్ధిలో మరో అడుగు ముందుకేసింది.భారతదేశం హైపర్‌ సోనిక్‌ క్షిపణులను అభివృద్ధి చేయడంలో వేగంగా ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో భారత్‌ సరిహద్దు దేశాలైన పాకిస్థాన్‌, చైనా, బంగ్లాదేశ్‌ వంటి దేశాలకు పెద్ద సవాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ క్షిపణులను అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థలతో ట్రాక్‌ చేయడం, అడ్డుకోవడం దాదాపు అసాధ్యంహైపర్‌ సోనిక్‌ క్షిపణుల అభివృద్ధి చాలా సవాళ్లతో కూడుకున్నది. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వీటి ప్రత్యేకత. హైపర్‌ సోనిక్‌ క్రూజ్‌ క్షిపణులు స్క్రామ్‌ జెట్‌ ఇంజిన్‌ లను ఉపయోగించుకొని తమ ప్రయాణ మార్గమంతటా హైపర్‌ సోనిక్‌ వేగాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ఇంజిన్లు లోనికి వచ్చే గాలిని సంపీడనానికి గురిచేసి, ఇంధనంతో మిశ్రమం చేస్తాయి. ఆ తరువాత చెలరేగే ప్రజ్వలనతో సూపర్‌ సోనిక్‌ వేగం సాధ్యమవుతుంది.

Views: 3

Latest News

TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట... TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట... కరీంనగర్‌-ప్రభాత సూర్యుడు  తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు