ముగిసిన సియం కప్ పోటీలు
*ముగిసిన సియం కప్ పోటీలు*
కల్లూరు -ప్రభాత సూర్యుడు
మండల నలుమూలల నుంచి 31 గ్రామ పంచాయతీల క్రీడాకారులకు నిర్వహించిన సీఎం కప్ పోటీలను ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, ఎంపీడీవో చంద్రశేఖర్ గురువారం ప్రారంభించారు.
ఈ పోటీలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచి వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. బాలుర వాలీబాల్ మొదటి స్థానంలో బత్తులపల్లి పంచాయితీ, రెండవ స్థానం మేజర్ కల్లూరు పంచాయతీ, బాలుర ఖోఖో చిన్న కోరుకొండి మొదటి స్థానంలో నిలవగా సెకండ్ ప్లేస్ కల్లూరు పంచాయితీ, బాలుర కబడ్డీ ఫస్ట్ ప్లేస్ కల్లూరు పంచాయతీ, సెకండ్ ప్లేస్ చెన్నూరు పంచాయతీ వారు గెలుపొందారు. బాలికల కబడ్డీ ఫస్ట్ ప్లేస్ కల్లూరు పంచాయతీ, సెకండ్ చిన్న కోరుకొండి.ఖోఖో ఫస్ట్ ప్లేస్ కల్లూరు పంచాయతీ, సెకండ్ ప్లేస్ చిన్న కోరుకొండి. బాలికల వాలీబాల్ ఫస్ట్ ప్లేస్ కల్లూరు పంచాయతీ, సెకండ్ ప్లేస్ చండ్రు పట్ల పంచాయతీ.అథ్లెటిక్స్ 3కే యం 800మీ,600మీ,400మీ,200మీ విభాగంలో గోల్డ్, సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ క్రీడాకారులకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల క్రీడల నిర్వహణ కార్యదర్శులు బోడా భీమా, ఫిజికల్ డైరెక్టర్ గవర్నమెంట్ హై స్కూల్ కల్లూరు పసుపులేటి వీర రాఘవయ్య పి ఈ టి కల్లూరు. పీడీలు కే రాధాకృష్ణ, జి.రమాదేవి. త్రివేణి పద్మ, పాపారావు కల్లూరు గేమ్స్ కమిటీ సభ్యులు టి గౌతమ రెడ్డి, డి నరేష్, కల్లూరు గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నందిశెట్టి నాగేశ్వరరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొని క్రీడలను విజయవంతం చేయటం జరిగింది.