Their services in the village are excellent:మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి
![Their services in the village are excellent:మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి](https://www.prabhathasuryudu.com/media-webp/2025-01/images-(1)2.jpg)
శతాధిక (మేదరి) రాములు మృతి తీరని లోటు
మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి
కమాన్ పూర్-ప్రభాత సూర్యుడు
రామగిరి మండలం
కల్వచర్ల గ్రామ శతాధిక వృద్ధ శిఖామణి యనమనగాండ్ల (మేదరి) రాములు(106) ఇక లేరని తెలియడం బాధకరం అని ఉమ్మడి కమాన్ పూర్ మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి అన్నారు..శుక్రవారం రాత్రి సుమారు 7.30 గంటలకు కాలం చేశారు అన్న విషయాన్ని తెలుసుకొని మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి వెళ్లి నివాళులు అర్పించి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. శనివారం మధ్యాహ్నం వారి అంత్యక్రియలు కల్వచర్ల గ్రామంలో జరగనున్నాయి. ఊరిలో వారి సేవలు అమోఘం. వారి జీవితం నుండి చాలా నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి, వారికి దేవుని పట్ల భక్తి భావం, రామాయణ, మహాభారత, భాగవతం, సంబంధించిన విషయాలలో, మన సంప్రదాయాల విషయంలో, జానపద పాటలలో వారికున్న జ్ఞానం అమోఘం. వారి జీవితం అందరికీ ఆదర్శం గా నిలిచారు. వారి కుటుంబానికి ఆయన లోటు ఎవరు తీర్చలేరని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ,భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా
ప్రార్థిస్తూన్నము. ఈ కార్యక్రమంలో బుస బాపన్న,బర్ల కనకయ్య తదితరులు ఉన్నారు.