TELANGANA NEWS UPDATES :  ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు

NEW RATIONS CARDS WILL BE ISSUED IN THE FORM OF SMART CARDS

On
 TELANGANA NEWS UPDATES :  ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు

 ఏటీఎం కార్డుల తరహాలో రేషన్‌ కార్డులు

హైదరాబాద్‌ - ప్రభాత సూర్యుడు 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్దమైంది. కొత్త రేషన్‌ కార్డుల కోసం విూసేవ కేంద్రాల ద్వారా 1.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయని సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు వెల్లడిరచారు. కులగణన సర్వే, గతంలో వచ్చిన అప్లికేషన్లు అన్నీ కలిపి ఈ సంఖ్య 10 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల మార్పుల కోసం 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. మార్చి 1న లక్ష కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న ఉమ్మడి జిల్లాలను మినహాయించి రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే కొత్త రేషన్‌ కార్డులు గతంలో మాదిరి కాకుండా.. స్మార్ట్‌ కార్డుల రూపంలో ఇవ్వాలని భావిస్తోంది. ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్‌, యూనిక్‌ నెంబర్‌తో కార్డులు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కార్డుల తయారీ కోసం షార్ట్‌ టెండర్‌ పిలిచే పనిలో సివిల్‌ సప్లయ్‌ అధికారులు నిమగ్నమయ్యారు. కార్డు నమూనా అప్రూవల్కోసం ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి వద్దకు ఫైల్‌ పంపినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్సిగ్నల్రాగానే కార్డుల ప్రింటింగ్‌ ప్రక్రియను మె?దలుపెట్టనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షలకు పైగా పాత రేషన్‌ కార్డు లబ్ధిదారులు ఉండగా.. వారితో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి కార్డులు ఇవ్వనున్నారు.పాతవి, కొత్తవి అన్నీ కూడా స్మార్ట్‌ చిప్‌తో కూడిన కార్డులు ఇవ్వాలని భావిస్తోంది. ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై ఎవరి ఫొటోలు ఉండవని.. కేవలం ఆధార్‌ తరహాలో యూనిక్‌ నెంబర్‌ మాత్రమే ఉంటుందని సివిల్‌ సప్లయ్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చెబుతున్నారు. ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్‌తో ఉండే ఈ కార్డును తయారు చేయనుండగా.. స్వైప్‌ చేస్తే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) మెషిన్‌లో లబ్ధిదారుల పేర్లు, ఆధార్‌ నెంబర్లు, అడ్రస్‌, ఇతర వివరాలు డిస్‌ ప్లే కానున్నాయి. యూనిక్నెంబర్‌ ఎంటర్‌ చేసినా, కార్డును స్వైప్‌ చేసినా పీఓఎస్‌ మెషిన్‌లో వివరాలు వచ్చేలా రూపొందిస్తున్నారు. ఈ స్మార్ట్కార్డుతో ఎక్కడైనా రేషన్‌ తీసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ చేస్తున్నారు.

Views: 4

Latest News