The government hopes that Visakhapatnam will get a new identity:విశాఖలో ఐటీ టవర్‌

On
The government hopes that Visakhapatnam will get a new identity:విశాఖలో ఐటీ టవర్‌

విశాఖలో ఐటీ టవర్‌

విశాఖపట్టణం-ప్రభాత సూర్యుడు

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ను ఐటీకి కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నగరం  నుంచి ఐటీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలతో పాటు భారీగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఏపీ ఐటీ కారిడార్‌ గా మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. విశాఖలో వాతావరణం కూడా బాగుండడం కలిసొచ్చే అంశం. కాగా.. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు అనువైనం ప్రదేశంగా విశాఖను చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే ఐటీ కోసం సరికొత్తగా ఐకానిక్‌ భవనాన్ని సిద్ధం చేస్తోంది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ లో ఐటీ సంస్థల కోసం హైటెక్‌ హంగులతో సైబర్‌ టవర్స్‌ ను నిర్మించించారు. హైదరాబాద్‌ చరిత్రలో సైబర్‌ టవర్స్‌ ఓ ప్రత్యేక అధ్యయంగా నిలిచిపోతుంది. నగరానికి వచ్చే ఐటీ సంస్థలకు, పూర్తి ఐటీ పరిశ్రమకు గుర్తుగా ఆ భవనం నిలిచిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు సరిగా అలాంటి ఐకానిక్‌ బిల్డింగ్‌ నే ఏపీలోని విశాఖలో నిర్మిస్తున్నారు.దావోస్‌ పర్యటనలో డేటా సెంటర్‌, గ్లోబల్‌ బిజినెస్‌ సెంటర్‌, ఏఐ అభివృద్ధి కేంద్రం, గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్‌ వంటివి ఏర్పాటు చేయాలంటూ ఆయా సంస్థలతో చర్చలు జరిపారు. ఆ సంస్థలు రాష్ట్రంలో ఉన్న వసతులు, విస్తరణ అవకాశాల్ని పరిశీలించడంతో పాటు.. ప్రభుత్వం అందించే సదుపాయాలను పరిగణలోకి తీసుకొని పెట్టుబడులు పెడతాయి. అందుకే.. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేందుకు.. వారికి కావాల్సిన వసతుల్ని సమకూర్చేందుకు.. విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ  ఓ ఐకానిక్‌ భవనాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ భవనం పనులు దాదాపు పూర్తిగాక.. ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల విూదుగా ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. దావోస్‌ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీలను కోరారు. డేటా సెంటర్‌, గ్లోబల్‌ బిజినెస్‌ సెంటర్‌, ఏఐ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, చిప్‌ తయారీ కేంద్రం, గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ వంటివి ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థలతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు ఏపీకి వస్తే.. ఆ సంస్థలు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మౌలిక వసతులను సిద్ధం చేయాల్సి ఉండటంతో అందుకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ నగరం మధ్యలో సిరిపురం వద్ద షిప్‌ ఆకారంలో 11 ఫ్లోర్లలో ఈ బిల్డింగ్‌ను నిర్మించారు. మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ సదుపాయం ఈ బిల్డింగ్‌లో ఉంది. 6 ఫ్లోర్లలోని 1.65 లక్షల స్క్వేర్‌ ఫీట్లను ఆఫీస్‌ స్పేస్‌కు ఉపయోగించనున్నారు. మరో 5 ఫ్లోర్లలోని 1.90 లక్షల స్క్రేర్‌ ఫీట్ల స్థలాన్ని పార్కింగ్‌కు వాడుకోనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, పార్కింగ్‌ వసతులతో అందుబాటులోకి తెచ్చిన ఈ భవనాన్ని గాలి, వెలుతురు వచ్చేలా అద్భుతంగా కనిపించేందుకు అద్దాలతో నిర్మించారు. 1.72 ఎకరాల్లో నిర్మించిన ఈ బిల్డింగ్‌కు రూ.87.50 కోట్లు ఖర్చు చేశారు. 5 అంతస్తుల పార్కింగ్‌లో 430 కార్లు, 400 బైక్‌లు పార్క్‌ చేసే సౌకర్యం ఉంది.ఇక ఈ బిల్డింగ్‌ అధికారంలోకి వస్తే గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌, డేటా ఇంక్యుబేషన్‌ సెంటర్లకు వీలుగా విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి. ఈ బిల్డింగ్‌ మొత్తాన్నీ జీసీసీలకు, మల్టీ నేషనల్‌ సంస్థలకు కేటాయించాలనే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించి.. యువతకు ఉపాధి కల్పించే పేరు ఉన్న సంస్థ కోసం ఏపీ ప్రభుత్వం ఎదురుచూస్తోంది. విశాఖ నగరం మధ్యలో ఈ బిల్డింగ్‌ ఉండటంతో ప్రముఖ సంస్థలు వస్తే ఒక బ్రాండిరగ్‌ ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు దావోస్‌లో పర్యటన ముగియడంతో.. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.సువిశాలమైన ఆఫీస్‌ స్పేస్‌ తో పాటు ఏకంగా ఐదు అంతస్తుల్లో కార్ల పార్కింగ్‌ సౌకర్యంతో ఈ భవనం సిద్ధమవుతోంది. నగరం నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ ఐకానిక్‌ బిల్లింగ్‌ ను పదకొండు అంతస్తులుగా డిజైన్‌ చేయగా.. అందులో మొదటి 5 అంతస్తుల్లోని 1.90 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేవలం పార్కింగ్‌ కోసమే కేటాయించారు. మిగతా ఆరు అంతస్తుల్లోని 1.65 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని  ఆఫీస్‌ స్పేస్‌ గా అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, పార్కింగ్‌ వసతులతో తీర్చిదిద్దిన ఈ భవనంలో.. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా డిజైన్‌ చేశారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికే ముందుకొచ్చే టెక్‌ సంస్థలకు ఈ భవనంలోనే ఆఫీస్‌ స్పేస్‌ కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సువీశాల ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులో ఉండటంతో జిసిసిలకు, బహుళ జాతి సంస్థకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. నగరానికి నడిబొడ్డున ఉన్న భవనంలో  టెక్‌ సంస్థల కార్యకలాపాలు మొదలయితే.. విశాఖకు సరికొత్త గుర్తింపు వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.

Views: 2

Latest News

ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి ILLEGAL IMMIGRANTS DETECTED IN ASSAM :అక్రమవలసదారులను పంపించేయండి
అక్రమవలసదారులను పంపించేయండి గౌహాతి-ప్రభాత సూర్యుడు అస్సాం రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడ్డ వారిని వారి స్వస్థలాలకు పంపించి...
AP POLITICS 2025 :మున్సిపాల్టీల్లో పట్టించుకోని కేడర్‌
TG RATION CARD UPDATE :కొత్త కార్డులతో పెరిగిన బియ్యం కోట...
TELANGANA AIRLINE UPDATE 2025 :కొత్తగూడెం ఎయిర్‌ పోర్టుకు లైన్‌ క్లియర్‌
AMARAVATHI NEWS 2025 :లాయర్ కాని సుబ్రహ్మణ్యస్వామిని లాయర్‌గా తీసేసిన టీటీడీ!
DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి