ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

బస్సులో సీట్లకోసం మహిళల సిగపట్లు, బస్సు ప్రయాణంలో మహిళలు గొడవ

On
ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

బస్సులో సీట్లకోసం మహిళల సిగపట్లు

వనపర్తి - ప్రభాత సూర్యుడు

ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని బస్టాం డ్‌ వద్ద గురువారం  సాయంత్రం వనపర్తికి వెళ్లే బస్సు ప్రయాణంలో మహిళలు గొడవ పడ్డారు. చీపుర్లు, కట్టెలతో కొట్టుకునే వరకు వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో మహిళల రద్దీ పెరిగింది. బస్సు ల్లో సీట్ల కోసం దొంతికుంట తండా మహిళలు తొందరపడి ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ గంప ఎత్తుకొని దిగుతూ ఒకరినొకరు తోసుకోవడంతో గొడవ జరిగింది. మండల కేంద్రానికి చెందిన మహిళ గిరిజన మహిళపై కట్టెతో దాడి చేసింది. అక్కడే ఉన్న కొంత మంది మహిళలు చీపుర్లతో ఎదురుదాడికి దిగారు...సిగలు పట్టుకొని కొట్టుకున్నారు...దీంతో గొడవ మరింత పెద్దది కావడంతో అక్కడే ఉన్న ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణ పథకంతో బస్సుల్లో మహిళల రద్దీ ఎక్కువయ్యిందని, అందుకు తగినట్లు బస్సుల సంఖ్యను పెంచలేదని, అందువల్లే తరచూ గొడవలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. సీట్లు సరిపోకపోవడంతో మహిళలతో పాటు, పురుషులు కూడా ఇబ్బంది పడ్తున్నారని చర్చించుకున్నారు. మహిళలు గొడవకు సంబంధించిన వీడియోలు వాట్సాప్‌ గ్రూపులో వైరల్‌ కావడం మండలంలో చర్చనీయాంశంగా మారింది... చివరకు స్థానికులు వారిని శాంతింపచేశారు.

Views: 122

Latest News

DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్ DELHI ELECTION UPDATE : ఢిల్లీ ఎలక్షన్స్
ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఢిల్లీ - ప్రభాత సూర్యుడు ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నకల్లో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును...
AP HEALTH ALRET 2025 : ఫారం కోళ్లకు అంతు చిక్కని వ్యాధి
AP NEWS UPADTE : డయాగ్నొస్టిక్ సెంటర్‌లో దారుణం.
AP Government Introduces New Guidelines :భవన నిర్మాణాలపై కొత్త మార్గదర్శకాలు
TELANGANA NEWS UPDATE 2025  :రీజనల్‌ రింగ్‌ రొడ్‌ కోసం నిధుల కసరత్తు
TG NEWS 2025:తెలంగాణ గట్టుపై ఆసక్తికర రాజకీయాలు
AP POLITICS 2025:పట్టభద్రుల ఎన్నికల్లో వలంటీర్లు